OnlineLand

నిబంధనలు (Terms of Use)

చివరి మార్పు: 2026-11-24

onlineland.in మరియు OnlineLand యాప్ వాడితే ఈ నిబంధనలకు మీరు అంగీకరించినట్లే. ఈ సేవలను OnlineLand Infra Private Limited అందిస్తుంది.

OnlineLand ఏమి చేస్తుంది

OnlineLand రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ మరియు ప్రాపర్టీ మార్కెట్‌ప్లేస్. కొనేవారిని, అమ్మేవారిని కలుపుతాం; enquiries మా team ద్వారా జరుగుతాయి. Deal మా ద్వారా జరిగితే, ముందే చెప్పిన కమీషన్ వర్తిస్తుంది.

Listings

  • మీరు పెట్టే ప్రాపర్టీ మీదే అయి ఉండాలి, లేదా అమ్మడానికి మీకు అనుమతి ఉండాలి. వివరాలు, ఫోటోలు, వీడియోలు నిజమైనవి అయి ఉండాలి.
  • ప్రతి listing admin చెక్ చేశాకే ప్రచురిస్తాం. తప్పుడు లేదా అనుమానాస్పద listings ను కారణం చెప్పి తిరస్కరిస్తాం లేదా తీసేస్తాం.
  • "పత్రాలు పరిశీలించాం" అంటే మేము చూసిన కాపీలు సరిపోయాయి అని మాత్రమే. కొనే ముందు మీ సొంత లాయర్‌తో టైటిల్, EC, సర్వే వివరాలు తప్పక చెక్ చేయించుకోండి.

ప్లాన్‌లు మరియు చెల్లింపులు

  • Basic మరియు Pro ప్లాన్‌లు నెలకు (30 రోజులు) లేదా సంవత్సరానికి (365 రోజులు). Featured listing 7 రోజులకు. ఓనర్‌కు 1 listing ఉచితం; తర్వాతి ప్రతి listing కి ఫీజు, అది అమ్ముడయ్యే వరకు లేదా 90 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుత ధరలు యాప్‌లో "నా ప్లాన్" లో ఉంటాయి.
  • చెల్లింపు UPI ద్వారా. మీరు UTR నంబర్ ఇచ్చాక, మా ఖాతాలో డబ్బు వచ్చిందని చెక్ చేసి ఆమోదిస్తాం.
  • ప్లాన్ ఆటోమేటిక్‌గా renew కాదు. గడువుకు ముందు మేము గుర్తు చేస్తాం.
  • Launch offer: OnlineLand ప్రకటించిన జిల్లాల్లో కొత్త dealers ఒక్కసారి ఉచిత ప్లాన్ తీసుకోవచ్చు. ఆఫర్ ఎప్పుడైనా ఆపవచ్చు.

OnlineLand ద్వారా అమ్మకం

ఓనర్ "OnlineLand అమ్మిపెట్టాలి" ఎంచుకుంటే, మేము కొనేవాళ్ళను తెచ్చి, బేరం, documents, registration వరకు సహాయం చేస్తాం. ఆ ఆస్తి మా ద్వారా అమ్ముడైతేనే ఫీజు (ఎంపిక చేసే సమయంలో యాప్‌లో చూపించిన శాతం). అమ్ముడుపోకపోతే ఏమీ కట్టనవసరం లేదు. ఓనర్ ఈ ఎంపికను ఎప్పుడైనా మార్చుకోవచ్చు; ఎంపిక చేసిన తేదీ, సమయం మా దగ్గర రికార్డ్ అవుతాయి.

సేవలు

డ్రోన్ వీడియో, documents చెక్, సర్వే, registration, లోన్ సహాయం. స్థిర ధర ఉన్న సేవలకు ఆ ధర, మిగతా వాటికి మేము చూసి చెప్పిన ధర చెల్లించాలి. చెల్లింపు UPI ద్వారా, మేము ఆమోదించాక పని మొదలవుతుంది. Documents చెక్ ఒక న్యాయవాది అభిప్రాయం మాత్రమే; తుది నిర్ణయం కొనేవారిదే.

Dealers

Dealer తన సొంత listing ల లింక్ షేర్ చేయవచ్చు. Paid ప్లాన్‌లో ఆ లింక్ ద్వారా వచ్చిన enquiries dealer కి కనిపిస్తాయి. OnlineLand సైట్/యాప్ సెర్చ్, ప్రకటనల ద్వారా వచ్చిన enquiries OnlineLand కే చెందుతాయి. కస్టమర్ వివరాలను enquiry కోసం మాత్రమే వాడాలి; spam చేస్తే ఖాతా నిలిపివేస్తాం.

చేయకూడనివి

నకిలీ listings, ఇతరుల ఫోటోలు, మోసపూరిత ధరలు, spam enquiries, సైట్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు. ఇలా చేస్తే ఖాతా నిలిపివేసి, అవసరమైతే చట్టపరమైన చర్య తీసుకుంటాం.

బాధ్యత

కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య జరిగే ఒప్పందం వారిద్దరిదే. listing లోని వివరాలకు, ప్రాపర్టీ టైటిల్‌కు OnlineLand హామీ ఇవ్వదు. చట్టం అనుమతించిన మేరకు, మా బాధ్యత మీరు మాకు చెల్లించిన ఫీజుకు మించదు.

చట్టం

ఈ నిబంధనలకు భారత చట్టాలు వర్తిస్తాయి. వివాదాలు తెలంగాణ కోర్టుల పరిధిలోకి వస్తాయి. నిబంధనలు మారితే ఈ పేజీలో తేదీ మారుస్తాం.